చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: జోగి రమేశ్
- విజయవాడ ఆసుపత్రిలో జరిగిన ఘటన దురదృష్టకరం
- శవ రాజకీయాలు చేయడానికే చంద్రబాబు ఆసుపత్రి వద్దకు వచ్చారు
- వాసిరెడ్డి పద్మపై కాల్ మనీ నేతలే దాడి చేశారు
టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలు చేసేందుకే ఆసుపత్రికి వచ్చారని విమర్శించారు. అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేల కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి వేసే సమయంలో కావాలనే చంద్రబాబు హడావుడి చేశారని మండిపడ్డారు. మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మపై కాల్ మనీ సెక్స్ రాకెట్ నేతలే దాడి చేశారని చెప్పారు. చంద్రబాబుకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. ఇకపై మహిళలపై ఈ తరహా ఘటనలు ఎక్కడ జరిగినా ఉక్కుపాదంతో అణచివేస్తామని చెప్పారు.