దేశంలో హిందువులకు ముప్పు రాబోతుంది: జీవీఎల్‌ నరసింహారావు

22-01-2022 Sat 15:12
  • ఏపీలో ప్రతి వాడలో మసీదులు, చర్చిలు నిర్మిస్తున్నారు
  • నరేగా నిధులతో వీటిని ఎలా నిర్మిస్తారు?
  • మదర్సాలను వెంటనే మూసివేయాలి
Lot of threat to Huduism in India
మన దేశంలో హిందూ మతానికి పెను ముప్పు వాటిల్లనుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. పీఎఫ్ఐ వంటి సంస్థలు ఐఎస్ఐ కనుసన్నల్లో నడుస్తున్నాయని... ఢిల్లీలో పీఎఫ్ఐ మత అల్లర్లకు పాల్పడిందని అన్నారు. ఈ సంస్థను నిర్మూలించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో 5 శాతం ముస్లింలు, ఒక శాతం క్రిస్టియన్లు ఉన్నారని... వీరి కోసం ప్రతి వాడలో మసీదులు, చర్చిలు నిర్మిస్తోందని మండిపడ్డారు. నరేగా నిధులతో వీటిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. మదర్సాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రజాగ్రహ సభ ద్వారా నిద్ర లేకుండా చేసి శరణు ప్రభూ అంటూ ఢిల్లీకి వెళ్లేలా చేశామని చెప్పారు. కర్నూలులో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.