మెటా హెడ్‌పై కేసు నమోదు చేసిన రెండ్రోజులకే... హైదరాబాద్ పోలీస్ అధికారిపై వేటు!
- హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ అరవింద్ బాబుపై బదిలీ వేటు
- ప్రధాని మోదీపై మార్ఫింగ్ వీడియోల కేసులో ఈ పరిణామం
- మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు చేసిన రెండు రోజులకే చర్యలు
- ఇది కక్ష సాధింపు చర్యేనంటూ తెలంగాణ బీజేపీ ఆగ్రహం
- అధికారిని బదిలీ చేయడం తుగ్లక్ చర్య అని విమర్శలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) వి. అరవింద్ బాబును ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది. ఆయనను తక్షణమే రాష్ట్ర పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన అభ్యంతరకర వీడియోల వ్యవహారంలో మెటా ఇండియా హెడ్‌పై కేసు నమోదు చేసిన రెండు రోజులకే ఈ బదిలీ జరగడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి 'కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)' పేరుతో నిర్వహించిన నిరసనల క్రమంలో, ప్రధాని మోదీకి సంబంధించిన మార్ఫింగ్ చేసిన అభ్యంతరకర వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై బీజేపీ సానుభూతిపరుడు ఎస్. అరవింద్ రెడ్డి, పార్టీ కార్యకర్త టి. సాయికిరణ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్‌తో పాటు సుమారు 20 అభ్యంతరకర లింకులకు సంబంధించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఈ పరిణామం చోటుచేసుకున్న రెండు రోజులకే డీసీపీ అరవింద్ బాబుపై బదిలీ వేటు పడటాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు. చట్ట ప్రకారం తన విధిని నిర్వర్తించిన అధికారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సరికాదని, ప్రధాని మోదీపై ఉన్న ద్వేషంతోనే ప్రభుత్వం ఇలా వ్యవహరించిందని ఆయన విమర్శించారు. దీనిని ఆయన 'తుగ్లక్ తరహా పాలన"గా అభివర్ణించారు. ప్రధానిని దూషించే వారిని కాపాడుతూ, నిజాయతీగా పనిచేసే అధికారులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు.