'సలాం తాలిబన్స్' అంటూ బాలికలతో బలవంతంగా గీతం పాడించిన వైనం.. వీడియో వైరల్
- పాకిస్థాన్‌లో ఘటన
- పాక్‌లో పలుసార్లు చిన్నారులపై తాలిబన్ల దాడులు
- అయినప్పటికీ తాలిబన్లను పొగుడుతూ పాట
- తాలిబన్ల జెండాలు కూడా కనపడ్డ వైనం
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని మహిళల మదర్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జామియా హఫ్సాకు చెందిన లాల్ మసీద్ వద్ద తాలిబన్లను పొగుడుతూ సమావేశం నిర్వహించారు. ఆ ప్రాంతంలో తాలిబన్ల జెండాలు కూడా కనపడ్డాయి. దీంతో స్థానిక అధికారులు అక్కడకు చేరుకుని తాలిబన్ల జెండాలను తొలిగించారు. పాకిస్థాన్‌లో చిన్నారులపై తాలిబన్లు చాలా సార్లు దారుణాలకు పాల్పడి చంపేశారు. అయినప్పటికీ చిన్నారులతోనే బలవంతంగా సలాం తాలిబన్స్ అంటూ గీతం పాడించడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.