కలిసొచ్చిన 'ఇన్ స్టాగ్రామ్ రీల్స్'... 100 బిలియన్ డాలర్లకు చేరిన జుకర్ బర్గ్ సంపద
- టిక్ టాక్ కు పోటీగా ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రంగప్రవేశం
- రీల్స్ రాకతో పెరిగిన ఫేస్ బుక్ షేర్ విలువ
- ఫేస్ బుక్ లో 13 శాతం వాటాలు కలిగివున్న జుకర్ బర్గ్
అమెరికాలో టిక్ టాక్ ను నిషేధించే ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడంతో 'ఇన్ స్టాగ్రామ్ రీల్స్' కు డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాలు ఫేస్ బుక్ షేర్ల విలువను 6 శాతం పెంచేశాయి. ఫేస్ బుక్ లో 13 శాతం వాటాలు కలిగివున్న మార్క్ జుకర్ బర్గ్ ఈ పరిణామాలతో బాగా లాభపడ్డారు. ఈ క్రమంలో ఆయన 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ రూపకర్త బిల్ గేట్స్ సరసన స్థానం సంపాదించుకున్నారు.