అందుకే వారిపై జగన్ కక్ష సాధిస్తున్నారు: వర్ల రామయ్య

varla ramaiah fires on jagan
  • ఏడాదిగా పాలన కక్ష, పగ, ప్రతీకారంతో సాగుతోంది
  • 2010లో మీపై హైకోర్టులో అక్రమాస్తుల కేసు వేశారు
  • దీంతో పలువురిపై కక్ష
  • ఇలా చేయడం న్యాయమా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ తీరు‌పై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కక్ష సాధింపు ధోరణితో జగన్‌ వ్యవహరిస్తున్నారని ఆయన ట్విట్టర్‌లో ఆరోపణలు గుప్పించారు.

'ముఖ్యమంత్రి గారు.. ఏడాదిగా మీ పాలన కక్ష, పగ, ప్రతీకారంతో సాగుతోంది. 2010లో మీపై హైకోర్టులో అక్రమాస్తుల కేసు వేశారని, ఆనాటి  కాంగ్రెసు దళిత మంత్రి శంకర రావు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎర్రం నాయుడు, అశోక్ గజపతిరాజు, బై రెడ్డి రాజశేఖరరెడ్డిలపై కక్ష సాధించడం ధర్మమా? న్యాయమా?' అని ఆయన ప్రశ్నించారు.
Go Back to Shorts
Varla Ramaiah
Telugudesam
YSRCP

More Telugu News