Rajamouli: కరోనా ఇప్పట్లో తగ్గేటట్టు లేదు.. ఇంకో 6 నెలలు థియేటర్లు పని చేయకపోవచ్చు: రాజమౌళి

Its take another 6 months for theaters to reopen says Rajamouli
షార్ట్స్‌లో చూడండి
కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై తీవ్ర స్థాయిలో పడింది. థియేటర్లు బంద్ అయ్యాయి. షూటింగులు ఎక్కడికక్కడ అగిపోయాయి. ఈ పరిస్థితి ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో ఎవరూ అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై సినీ దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, కరోనా ప్రభావం ఇప్పుడే తగ్గే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. థియేటర్లు నడవడానికి మరో ఆరు నెలలు పట్టొచ్చని చెప్పారు. కరోనా ప్రభావం తగ్గినా... ప్రజల్లో భయం పోవడానికి సమయం పడుతుందని అన్నారు.

ఇదే అంశంపై మరో నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు ఇటీవల స్పందిస్తూ, మరో మూడు నెలల పాటు థియేటర్లను మూసి ఉంచితేనే మంచిదని అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Rajamouli
Tollywood
Corona Virus

More Telugu News