ఈ నెల 15 నుంచి దేశీయ విమాన సర్వీసుల ప్రారంభం!
- బుకింగ్స్ ప్రారంభించిన పలు విమానయాన సంస్థలు!
- 30వ తేదీ వరకు సేవలు నిలిపివేశామంటున్న ఎయిర్ ఇండియా
- ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న సంస్థలు
ఎయిర్ ఇండియా సంస్థ మాత్రం ఈ నెల 30వ తేదీ వరకు తమ సర్వీసులను తిరిగి ప్రారంభించబోమని స్పష్టం చేసింది. దేశీయ, విదేశీ మార్గాల్లో అప్పటిదాకా విమానాలు నడుపబోమని చెప్పింది. మిగతా సంస్థలు మాత్రం ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురు చూస్తున్నాయి. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఆంక్షలు సడలిస్తుందని, ఇందులో తమ సర్వీసులు కూడా ఉంటాయని భావిస్తున్నాయి.
ఇక లాక్‌డౌన్ కారణంగా గత నెల 24 నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వాటిని యథావిధిగా కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరి రెండు రోజుల కిందట ప్రకటించారు.