Pakistan: కరోనా కష్టాల్లో కూడా మారని పాకిస్థాన్.. హిందువులపై వివక్ష!

  • పాకిస్థాన్ పై కరోనా పంజా
  • ముస్లింలకు మాత్రమే అందుతున్న నిత్యావసర వస్తువులు
  • హిందువులకు ఇవ్వమని తెగేసిచెబుతున్న అధికారులు

కరోనా దెబ్బకు పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. ఆర్థికంగా ఇప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ఆ దేశం... కరోనా కారణంగా బెంబేలెత్తిపోతోంది. ఇప్పటికే వందలాది మంది కరోనా బారిన పడ్డారు. అయితే, ఉన్నంతలో బాధితులను ఆదుకోవడానికి అక్కడి ప్రభుత్వం యత్నిస్తోంది. అయితే, ఈ పరిస్థితుల్లో కూడా అక్కడి హిందువులపై వివక్ష కొనసాగుతోంది. వారికి రేషన్ ఇవ్వడం లేదు. కరాచీలో నిత్యావసర వస్తువులను ముస్లింలకు అందిస్తూ, హిందువులకు ఇవ్వడం లేదు. ముస్లింలకు మాత్రమే రేషన్ అని అధికారులు తెగేసి చెబుతున్నారు. దీనిపై మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.

More Telugu News