ఎన్ని లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో లోక్ సభకు తెలిపిన ప్రభుత్వం!
- ఖాళీగా ఉన్న కేంద్ర ఉద్యోగాల సంఖ్య 6.83 లక్షలు
- త్వరలోనే 3,10,832 ఉద్యోగాల భర్తీ
- ఉద్యోగ నియామకాలు నిరంత ప్రక్రియ అన్ని జితేంద్ర సింగ్
ఉద్యోగ నియామకాలు అనేది ఒక నిరంతర ప్రక్రియ అని జితేంద్ర సింగ్ చెప్పారు. 1,16,391 ఉద్యోగాల కోసం ఆర్ఆర్బీ, 13,995 ఉద్యోగాల కోసం ఎస్ఎస్సీ, 4,399 ఉద్యోగాల కోసం యూపీఎస్సీలు రెకమెండ్ చేశాయని వెల్లడించారు. వీటితో పాటు రక్షణ శాఖ, పోస్టల్ డిపార్ట్ మెంటులు కలిసి 3,10,832 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయని తెలిపారు.