నేనో సినిమాలో నటించిన సంగతిని గుర్తు చేసినందుకు నాగబాబుకు ధన్యవాదాలు: అంబటి
- గతంలో తోకలేని పిట్ట చిత్రంలో నటించిన అంబటి
- సెటైర్ వేసిన నాగబాబు
- కౌంటర్ ఇచ్చిన అంబటి
"తోకలేని పిట్ట అనే సినిమాలో నటించిన విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. మళ్లీ ఇప్పుడు నాగబాబు గారు గుర్తుచేశారు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే, అప్పుడు నేను నటనలో ఫెయిలవడంతో సినీ రంగం నుంచి నిష్క్రమించాను. మరిప్పుడు మీరు రాజకీయాల్లో ఓటమిపాలయ్యారు నాగబాబు గారూ, నిష్క్రమిస్తారా, లేక..." అంటూ తనదైన శైలిలో స్పందించారు.