cm: సీఎం జగన్ గారూ! ఏపీలో పరిపాలన ఎటుపోతోంది: వర్ల రామయ్య

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో పరిపాలన ఎటుపోతోందని సీఎం జగన్ కు టీడీపీ నేత వర్ల రామయ్య సూటి ప్రశ్నవేశారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాజధాని అమరావతిని తరలించడానికి, మూడు ముక్కలు చేయడానికి వీల్లేదని రాష్ట్రంలో మహాఉద్యమం నడుస్తోందని అన్నారు. ఈ ఉద్యమానికి ‘కౌంటర్ ఉద్యమం’ ప్రారంభిస్తారా? అంటూ జగన్ పై మండిపడ్డారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచన చేయకుండా ఇలా కౌంటర్ ఉద్యమం నిర్వహించేలా ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా? అని మండిపడ్డారు. 
Go Back to Shorts
cm
Jagan
Andhra Pradesh
Telugudesam
Varla

More Telugu News