39వ రోజు.. విజయవంతంగా కొనసాగుతున్న టీడీపీ 'ఇంటింటికీ తెలుగుదేశం'
- 39వ రోజుకు చేరిన ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’
- రాష్ట్రవ్యాప్తంగా 99.85 లక్షల ఇళ్లను సందర్శించిన టీడీపీ శ్రేణులు
- కోటి కుటుంబాల మైలురాయికి చేరువైన పార్టీ కార్యక్రమం
- ప్రభుత్వ పథకాలు వివరిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న నేతలు
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం-2026’ కార్యక్రమం కోటి ఇళ్ల మైలురాయికి చేరువలో ఉంది. గత 39 రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ పర్యటనల్లో భాగంగా గురువారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 99.85 లక్షల కుటుంబాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిశారు. ఒక్క గురువారం నాడే 1,32,987 ఇళ్లను సందర్శించడం గమనార్హం.
కూటమి ప్రభుత్వం గత రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, వారి సమస్యలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగుతోంది. ఇంటింటి పర్యటనల ద్వారా టీడీపీ శ్రేణులు ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరిస్తూ, లబ్ధిదారుల నుంచి ప్రత్యక్షంగా స్పందనను సేకరిస్తున్నారు.
అదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, వారి అవసరాలను సైతం పార్టీ ప్రతినిధులు నమోదు చేసుకుంటున్నారు. ఈ వివరాలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోనున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి.