Jagan: మీరు చెప్పినట్లే ఖైదీ నంబరు 6093 అని గూగుల్ లో టైప్ చేశాను.. జగన్ పేరు వచ్చింది: చంద్రబాబుతో రాజధాని అమ్మాయి

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే ఉండాలని ఎర్రబాలెంలో దీక్ష చేస్తోన్న రైతులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూగుల్ లో 6093 అని సెర్చ్ చేసి చూడాలని, ఖైదీ నంబరు 6093 అని కొడితే జగన్ పేరు వస్తుందని అన్నారు. దీంతో ఓ అమ్మాయి తన చేతిలోని ట్యాబ్ లో ఖైదీ నంబరు 6093 అని కొట్టింది. అందులో జగన్ పేరు వచ్చిందని చంద్రబాబు నాయుడికి అందరి ముందే తెలిపింది. ఆ గూగుల్ సెర్చ్ ఫలితాన్ని చంద్రబాబు నాయుడు చూశారు. రాజధాని వల్ల సంపద, దాని వల్ల పేదలకు ఆదాయం వస్తుందని ఆయన అన్నారు. కానీ, జగన్ తన చేష్టలతో సంపద రాకుండా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. యువతకు జగన్ కనీసం స్కాలర్ షిప్ లు కూడా ఇవ్వలేకపోతున్నారని అన్నారు.
Go Back to Shorts
Jagan
Chandrababu
amaravati

More Telugu News