కొండా సురేఖ దారెటు?.. ఆసక్తి రేపుతున్న ‘ప్లాన్ బీ’
- మంత్రి పదవి నుంచి కొండా సురేఖ బర్తరఫ్
- కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర చర్చ
- ఆసక్తి రేకెత్తిస్తున్న కొండా మురళి ‘ప్లాన్ బి’
- బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు దాదాపు లేనట్టే!
- బీజేపీలో చేరికపై ప్రచారం.. పార్టీలో భిన్నాభిప్రాయాలు
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఇప్పుడు కొండా కుటుంబం రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. వివాదం మొదలైనప్పటి నుంచి ఒకే వైఖరిపై నిలబడిన కొండా దంపతులు, తదుపరి కార్యాచరణ కోసం ఇప్పటికే ‘ప్లాన్ బి’ సిద్ధం చేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. కొండా మురళి నర్మగర్భంగా చేసిన ఈ ‘ప్లాన్ బి’ వ్యాఖ్యలే ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కొండా సురేఖ తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లడమే వారి ప్లాన్ బి అయి ఉండొచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే, ఉప ఎన్నికలో గెలవాలన్నా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయంగా మనుగడ సాగించాలన్నా ఏదైనా ఒక బలమైన పార్టీ మద్దతు తప్పనిసరి అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగే అవకాశాలు దాదాపు లేనట్టేనని తెలుస్తోంది.
ఇక బీఆర్ఎస్ విషయానికొస్తే, 2018 ఎన్నికలకు ముందు ఆ పార్టీని వీడుతూ కేసీఆర్, కేటీఆర్‌లపై కొండా దంపతులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో చేరే మార్గాలు మూసుకుపోయినట్టేనని సమాచారం. మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొండా దంపతులను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం సానుకూలంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర నాయకత్వంలో కొందరి నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఆమె భర్త కొండా మురళి మీడియా ముందుకు వచ్చి మీసం తిప్పడం, వారి పోరాట పటిమ తగ్గలేదనడానికి సంకేతంగా భావిస్తున్నారు. అయితే, ఏ విషయంలోనూ తొందరపడకుండా, తమ నియోజకవర్గంలోని అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కొండా దంపతులు భావిస్తున్నట్టు సమాచారం. ఇతర పార్టీల నుంచి వచ్చే ప్రతిపాదనలను బట్టి వారి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.