డెంగీతో బాధపడుతున్న బాలీవుడ్ హీరో
- కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్
- డెంగీ సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడి
- విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
ముంబై మిర్రర్ కథనం ప్రకారం... గత కొన్ని రోజులుగా సుశాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. డెంగీ సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో, తన వర్క్ షెడ్యూల్ ను ఆయన రీషెడ్యూల్ చేసుకున్నాడు. ఈ వారంలో ఓ కార్యక్రమం కోసం సుశాంత్ అబుదాభి వెళ్లాల్సి ఉంది. కానీ, విశ్రాంతి తీసుకోవాలని ఆయనకు వైద్యులు సూచించడంతో, అబుదాభి పర్యటనను రద్దు చేసుకున్నాడు. మరోవైపు, సుశాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.
ఈ ఏడాది పలువురు సెలెబ్రిటీలు డెంగీ బారిన పడ్డారు. ధర్మేంద్ర, జైన్ ఇమామ్, టీవీ నటుడు మొహ్సిన్ ఖాన్ డెంగీ కారణంగా బాధపడ్డారు.