డబ్బు, కారుతో ఉడాయించిన స్వామీజీ డ్రైవర్
- అవుటర్ రింగురోడ్డుపై ఘటన
- మూత్ర విసర్జన కోసం కారు ఆపిన స్వామీజీ
- పటాన్‌చెరు టోల్‌గేట్ వద్ద కారును వదిలేసి పరార్
స్వామీజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. కారుతో పరారైన డ్రైవర్ పటాన్‌చెరు టోల్‌గేట్ సమీపంలో వాహనాన్ని వదిలేసి అందులోని రూ.40 వేలు తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకున్న కారును స్వామీజీకి అప్పగించారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.