ఇంటింటికీ టీడీపీ: ఏడు రోజుల్లో 17.61 లక్షల ఇళ్లకు.. ప్రభుత్వంపై విశ్వాసానికి నిదర్శనమన్న లోకేశ్
- ఏపీలో ఇంటింటికీ టీడీపీ
- 7 రోజుల్లో 17.61 లక్షల కుటుంబాలను కలిసిన కూటమి శ్రేణులు
- ఆదివారం సెలవు రోజైనా 3 లక్షలకు పైగా గృహాలను సందర్శించిన నేతలు
- టెలీకాన్ఫరెన్స్ ద్వారా పురోగతిని సమీక్షించిన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
- టెక్నాలజీతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఇంటింటికీ టీడీపీ – 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఏడో రోజైన ఆదివారం కూడా ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఏడు రోజుల్లో కూటమి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,61,197 ఇళ్లను సందర్శించి, ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు.
ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం విరామం తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడో రోజు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 3,01,197 ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా, గత రెండేళ్లలో ప్రభుత్వం రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలన వంటి రంగాల్లో సాధించిన విజయాలను ప్రజలకు వివరించారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన ప్రయోజనాలను గణాంకాలతో సహా తెలియజేశారు.
ఈ కార్యక్రమ పురోగతిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సెలవు రోజు కూడా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.
మరోవైపు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ఈ కార్యక్రమాన్ని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కార్యక్రమ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన సూచనలు చేస్తున్నారు. ఆదివారం కూడా విశేష ఉత్సాహంతో పాల్గొనడం, ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన చూస్తుంటే ప్రభుత్వంపై ఉన్న విశ్వాసం స్పష్టమవుతోందని లోకేశ్ అన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రతి ఇంటికీ చేరుకుని ప్రభుత్వ పనితీరును వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఈ కార్యక్రమం నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.