లిబియా నుంచి తక్షణమే వచ్చేయండి.. భారతీయులకు విదేశాంగశాఖ సూచన
- రోజురోజుకూ క్షీణిస్తున్న పరిస్థితులు
- ఇప్పటి వరకూ 200 మంది మృతి
- ఆందోళన వ్యక్తం చేసిన యూఎన్ఓ
500 మందికి పైగా భారతీయులు లిబియా రాజధాని ట్రిపోలీలో ఉన్నారని విదేశాంగ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి ట్రిపోలి నుంచి విమానాలను నడుపుతున్నామని, ఆ తరువాత భారతీయులను అక్కడి నుంచి తీసుకురావడం కష్టమవుతుందని, కాబట్టి తక్షణమే లిబియాను వీడాలని తెలిపింది.