ఒకవేళ చంద్రబాబు తనకు ఎదురుపడితే రామ్ గోపాల్ వర్మ ఇలా స్పందిస్తారట!
- ఆయన నన్ను ఏమంటారో నాకు తెలియదు
- నాకు ఆయన అంటే చాలా ఇష్టం
- ఎందుకంటే, విలన్స్ అంటే నాకు ఇష్టం
'చంద్రబాబు గ్రేట్ అడ్మినిస్ట్రేటర్, మిగిలిన విషయాలు అలా ఉంచితే, ఈ సినిమాలో ఆయన పాత్ర విలన్' అని స్పష్టం చేశారు. చంద్రబాబు చూడమని చెప్పిన ‘మహానాయకుడు’ ఎవరూ చూడలేదు, చూడొద్దని చెప్పిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని అందరూ చూశారని ఓ ప్రశ్నకు బదులుగా వర్మ చెప్పారు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి వర్మకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ గురించి ప్రస్తావించగా, ‘హర్ష అనే యాక్టర్ నాకు మెస్సెజ్ పెట్టాడు. ‘యు ఆర్ ఓన్లీ ట్రూ సన్ ఆఫ్ ఎన్టీఆర్’ అని’ చెప్పుకొచ్చారు.