Chandrababu: మనవడితో కలిసి చిన్న పిల్లాడిలా అల్లరిచేసిన సీఎం చంద్రబాబునాయుడు

షార్ట్స్‌లో చూడండి
  సుదీర్ఘ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాస్త సేదదీరారు. దాదాపు 110 బహిరంగ సభలు, రోడ్ షోలతో ఊపిరి సలపని విధంగా ప్రచార పర్వంలో పాల్గొన్న ఆయన విరామ సమయంలో తన నివాసంలో మనవడితో కలిసి ఆటపాటల్లో మునిగితేలారు. నారా లోకేశ్-బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ తో ఉత్సాహంగా పరుగులు తీస్తూ చిన్నపిల్లాడిలా మారిపోయారు. ప్రచారం ముగియడంతో చంద్రబాబు తన కుటుంబానికి కాస్త సమయం కేటాయించారు.

దేవాన్ష్ తో చంద్రబాబు అల్లరిని నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఉప్పెనలాంటి విజయం కోసం అలుపెరగకుండా శ్రమించారని, దొరికిన కొద్దిపాటి సమయంలో తన కుటుంబంతో ఉల్లాసంగా గడిపారని వివరించారు. తాతమనవడి ఆనందమయ క్షణాలు చూడండి అంటూ పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu
Nara Lokesh

More Telugu News