అన్న బాటలో పవన్.. ‘జనసేన’ను టీడీపీకి ఎప్పుడో అమ్మేస్తారు: వైఎస్ షర్మిళ
- నాడు పీఆర్పీని ‘కాంగ్రెస్’లో విలీనం చేశారు
- ‘జనసేన’ను టీడీపీకి హోల్ సేల్ గా అమ్మేస్తారు
- చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారు
జనసేన పార్టీని టీడీపీకి హోల్ సేల్ గా పవన్ ఎప్పుడో అమ్మేస్తారని సెటైర్లు విసిరారు. చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ నడుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏపీలో అవినీతి పాలన పోయి రాజన్న రాజ్యం రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. టీడీపీ వాళ్లు ఓట్లు అడిగేందుకు వచ్చి, డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తారని ఆరోపించారు. ఆ డబ్బులు ఇచ్చేందుకు ఎవరైతే వస్తారో వారిని కూర్చోబెట్టి, బాబు ఇచ్చిన హామీలు నెరవేర్చమని వారికి చెప్పాలని ప్రజలకు షర్మిళ సూచించారు.