Chandrababu: పవన్ అత్తారింటికే దారి చూపిస్తాడు... నేను అన్ని దారులు చూపించగలను: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనదైన శైలిలో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇవాళ గుంటూరు జిల్లాలో పలు చోట్ల ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు తాజాగా నరసరావుపేటలో రోడ్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వ్యాఖ్యలు చేశారు.

"పవనేదో అంటున్నాడు, నా సైకిల్ చెయిన్ ను టీఆర్ఎస్ వాళ్లు తెంపేస్తారంట! అది జరిగే పనేనా తమ్ముళ్లూ! దగ్గరకొస్తే షాక్ కొడుతుంది మన సైకిల్. ఎవరైనా ముందుకొస్తే సైకిల్ స్పీడు పెంచుతాను. అప్పటికీ అడ్డం తిరిగి అడ్డంగా వస్తే తొక్కించుకుంటూ వెళతాను. అదీ మన సైకిల్ సత్తా. ఈ పవన్ కు అత్తారింటికి మాత్రమే దారి తెలుసు, కానీ తమ్ముళ్లూ నేను అన్ని దారులు చూపించగలను" అంటూ ఓవైపు హెచ్చరిక, మరోవైపు చమత్కారం కలగలిపి మాట్లాడారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Pawan Kalyan

More Telugu News