పవన్ అత్తారింటికి దారి చూపిస్తారు, జగన్ జైలుకు దారి చూపిస్తారు: వినుకొండ రోడ్ షోలో చంద్రబాబు సెటైర్లు

  • వాళ్లిద్దరూ అంతకుమించి ఏమీ చేయలేరు
  • యువత భవిషత్తు నా బాధ్యత
  • చంద్రబాబు హామీ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా వినుకొండ సభలో రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో వాగ్బాణాలు సంధించారు. కోడికత్తి ఉన్నాడు కానీ అతడి వల్ల ఏం లాభం లేదని, సినిమా యాక్టర్ వల్ల కూడా ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ అత్తారింటికి దారి చూపిస్తాడు తప్ప అంతకుమించి మరేమీ చేయలేడని వ్యంగ్యం ప్రదర్శించారు. జగన్ విషయానికొస్తే ఆయనకు జైలుకు దారి చూపించడం తప్ప మరేమీ తెలియదని విమర్శించారు. వారికి ఓటేస్తే కష్టమేనని అన్నారు.

తాను మాత్రం యువతకు రాచబాట చూపిస్తానని హామీ ఇచ్చారు. ఎవరు కావాలో మీరే తేల్చుకోవాలని సూచించారు. తనకు ఓటేస్తే రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. యువతకు అన్ని విధాలా చేయూతనిచ్చి బంగారు భవిష్యత్తు అందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. జగన్ ప్రతిరోజు లోటస్ పాండ్ లోనే ఉంటాడని, తాను మాత్రం ఇక్కడ రాష్ట్రంలోనే ప్రజల మధ్య ఉన్నానని తెలిపారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Pawan Kalyan

More Telugu News