Chandrababu: సైకిల్ చైన్ తాకి చూడండి తెలుస్తుంది!: పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరిన చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచారు. ఓవైపు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు చేరువ చేస్తూనే మరోవైపు ప్రత్యర్థులపై నిప్పులు చెరిగే ప్రసంగాలు చేస్తున్నారు. తాజాగా, శ్రీకాకుళం జిల్లా రాజాం రోడ్ షోలో పవన్ కల్యాణ్ సైకిల్ చైన్ పై చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. తన సైకిల్ చైన్ ను కేసీఆర్ ఎప్పుడో తెంపేశాడని పవన్ వ్యాఖ్యానిస్తున్నారని, కానీ తనది మామూలు సైకిల్ కాదన్న విషయం తెలుసుకోవాలని హెచ్చరించారు. అంతేకాదు, తన సైకిల్ చైన్ ను దమ్ముంటే పట్టుకుని చూడాలని సవాల్ విసిరారు.

"నా సైకిల్ చైన్ దగ్గరకొస్తే షాక్ కొట్టి అక్కడే ఫినిష్ అయిపోతారు, అడ్రసే ఉండదు. ఇది మామూలు సైకిల్ కాదు, ఎంత అవసరమైతే అంత జోరు పెరుగుతుంది. అవినీతిపరులు, దొంగలు ఎదురొచ్చినా వెనక్కు వెళ్లదీ సైకిల్" అంటూ అభిమానులను, కార్యకర్తలను ఉర్రూతలూగించేలా మాట్లాడారు.

అంతకుముందు, తన ప్రసంగంలో జగన్ పైనా సెటైర్లు వేశారు. కోడికత్తి పార్టీ అధినేత కేసుల్లో చిక్కుకుని కేసీఆర్, మోదీలకు బానిసగా మారాడని ఎద్దేవా చేశారు. "కేసీఆర్ డ్యాన్ చేయమన్నా చేస్తాడు, ఆడమంటే ఆడతాడు, ఎగరమంటే ఎగురుతాడు, బాంచన్ నీ కాల్మొక్తా అంటాడు" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Go Back to Shorts
Chandrababu
Pawan Kalyan

More Telugu News