టీడీపీ తరపున అమలాపురం లోక్‌సభ బరిలో హర్షకుమార్?
- గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ
- ఈవేళ చంద్రబాబును కలవనున్న మాజీ ఎంపీ
- భేటీ అనంతరం నిర్ణయం వెలువడే అవకాశం
రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో కాంగ్రెస్ ప్రాభవం కోల్పోవడంతో హర్షకుమార్ ఈసారి సైకిలెక్కి అదృష్టం పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. హర్షకుమార్‌తో భేటీ అనంతరం ఈ విషయంపై చంద్రబాబు ఒక ప్రకటన చేయవచ్చునని భావిస్తున్నారు. లోక్‌సభకు హర్షకుమార్ పేరు ఖరారైతే అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి జి.ఎం.సి. హరీష్‌మాధుర్‌ను పోటీ చేయించే అవకాశం ఉందంటున్నారు.