జనసేనలోకి 'ఆ ఎంపీ రావాలి, ఈ ఎంపీ రావాలి' అని నేను కోరుకోవడం లేదు: పవన్
- ప్రభుత్వ సొమ్మును డ్వాక్రా మహిళలకు ఇచ్చి ఓట్లు కొంటున్నారు
- కొండారెడ్డి స్ఫూర్తితో రాజకీయ ప్రక్షాళన
- నాది కులాలను ఏకం చేసే రాజకీయం
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కొండారెడ్డి స్ఫూర్తితో రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని పవన్ పేర్కొన్నారు. జనసేనలోకి ఆ ఎంపీ రావాలని, ఈ ఎంపీ రావాలని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. కొత్త రక్తం రాజకీయాల్లోకి రావాలన్నదే తన తాపత్రయమని పేర్కొన్నారు. ప్రజలను కులమతాల వారీగా విడదీసి హామీలు ఇవ్వడం సరికాదన్న పవన్.. తాను కులాలను ఏకం చేసే రాజకీయాలు చేస్తానన్నారు. తనకు కాన్షీరాం ఆదర్శమని పవన్ పేర్కొన్నారు.