నష్టపోవడంలో జుకర్ బర్గ్ రికార్డును బ్రేక్ చేసిన జెఫ్ బెజోస్... 48 గంటల్లో రూ. 1,40,962 కోట్ల నష్టం!
- ఇంటర్నేషనల్ మార్కెట్లో అనిశ్చితి
- దారుణంగా పడిపోయిన అమెజాన్ ఈక్విటీ విలువ
- సంపదను కోల్పోతున్న బిలియనీర్లు
అమెజాన్ ఈక్విటీల విలువ ఈ నెలలో భారీగా పతనమైంది. దీంతో నెలారంభంలో 167.7 బిలియన్ డాలర్లుగా ఉన్న బెజోస్ సంపద ప్రస్తుతం 128.1 బిలియన్ డాలర్లకు చేరింది. గతంలో ఈ రికార్డు ఫేస్ బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ పేరిట ఉండేది. ఈ సంవత్సరం జూలైలో ఆయన రెండు రోజుల వ్యవధిలో 16.5 బిలియన్ డాలర్లు నష్టపోయిన సంగతి తెలిసిందే. సంస్థ ఖాతాదారుల వివరాలు చోరీకి గురయ్యాయని వార్తలు వచ్చిన సమయంలో ఇది జరిగింది. కాగా, మరో బిలియనీర్ బిల్ గేట్స్, గత రెండు రోజుల్లో 558.3 మిలియన్ డాలర్ల సంపదను నష్టపోయారు.