అత్యాచారం కేసులో హాలీవుడ్ కమెడియన్ బిల్ కోస్బీకి పదేళ్ల జైలు శిక్ష!
- పదేళ్ల క్రితం స్నేహితురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
- ఏప్రిల్లో దోషిగా తేలిన బిల్ కోస్బీ
- కోస్బీని ప్రిడేటర్గా పోల్చిన కోర్టు
టెంపుల్ యూనివర్సిటీ మాజీ అడ్మినిస్ట్రేటర్ అయిన తన స్నేహితురాలు ఆండ్రియా కాన్స్టాండ్పై 2004లో తన ఇంట్లోనే కోస్బీ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో ఏప్రిల్లో అతడిని కోర్టు దోషిగా నిర్ధారించింది. తాజాగా శిక్ష ఖరారు చేసింది. #Me Too ఉద్యమంలో తొలిసారి శిక్షకు గురైన సెలబ్రిటీ కోస్బీనే కావడం గమనార్హం. కాగా, కోస్బీ కనీసం మూడేళ్లు జైలులో గడపాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతడి ప్రవర్తనను బట్టి విడుదలయ్యే అవకాశాలుంటాయి.