సీఎన్‌ఎన్, పాలిటికో జర్నలిస్టులకు వైట్‌హౌస్ ప్రవేశం పునరుద్ధరించాలి: ట్రంప్ నిషేధాన్ని రద్దు చేసిన అమెరికా న్యాయమూర్తి
- సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పాలిటికో సంస్థలు శ్వేతసౌధంలోకి రాకుండా ట్రంప్ నిషేధం
- ఈ నిషేధం రాజ్యంగ విరుద్ధమన్న ఫెడరల్ కోర్టు జడ్జి
- వెంటనే పాసులు పునరుద్ధరించాలని ఆదేశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పాలిటికో మీడియా సంస్థల జర్నలిస్టులకు వైట్‌హౌస్ ప్రవేశాన్ని నిషేధించిన నిర్ణయాన్ని ఫెడరల్ న్యాయమూర్తి తిప్పికొట్టారు. ఈ నిషేధం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, వెంటనే ప్రెస్ పాసులు పునరుద్ధరించాలని ఆదేశించారు. యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి టిమ్ కెల్లీ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. సెప్టెంబర్ 18న ట్రంప్ ప్రకటించిన నిషేధాన్ని సవాలు చేస్తూ ఈ మూడు సంస్థలు దాఖలు చేసిన దావాలో ఈ తీర్పు వెలువడింది. 14 రోజుల పాటు నిషేధాన్ని అమలు చేయవద్దని, ప్రెస్ పాసులు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
జాతీయ భద్రత కారణాలతో నిషేధం విధించినట్లు ప్రభుత్వం వాదించినా, దానికి ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ట్రంప్ స్వయంగా ఈ మీడియా సంస్థలు ‘అబద్ధాలు, నెగిటివ్ రిపోర్టింగ్’ చేస్తున్నాయని చెప్పి నిషేధించారని పేర్కొన్నారు. ఫస్ట్ అమెండ్‌మెంట్ కింద ప్రెస్ స్వేచ్ఛకు భంగం కలిగిందని, డ్యూ ప్రాసెస్ లేకుండా నిషేధం విధించారని జర్నలిస్టులు వాదించారు. ఈ న్యాయపోరాటం నవంబర్ 3న జరిగే మిడ్‌టర్మ్ ఎన్నికలకు కొన్ని వారాల ముందు వచ్చింది. ప్రెస్ ఫ్రీడమ్ సంస్థలు, అనేక మీడియా గ్రూపులు ఈ మూడు సంస్థలకు మద్దతు ప్రకటించాయి.