పండగ సీజన్‌కు ముందు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వంట నూనె ధరలు తగ్గే అవకాశం!

పండగ సీజన్‌కు ముందు కేంద్రం గుడ్‌న్యూస్‌.. వంట నూనె ధరలు తగ్గే అవకాశం!

Central Government good news before festive season edible oil prices likely to decrease
  • వంట నూనెలపై దిగుమతి సుంకం తగ్గింపు
  • అర్ధరాత్రి నుంచి కొత్త సుంకాలు అమలు
  • క్రూడ్‌ సోయాబీన్‌, పామ్‌ ఆయిల్‌పై 5 శాతం
  • క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై సుంకం పూర్తిగా రద్దు
  • రిఫైన్డ్‌ సోయాబీన్‌, పామ్‌ ఆయిల్‌పై 27.5 శాతం
పండగల వేళ వంట నూనె ధరలు పెరగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్రూడ్‌ పామాయిల్‌, సోయాబీన్‌ ఆయిల్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌తో పాటు రిఫైన్డ్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌పై దిగుమతి సుంకాలను తగ్గించింది. కొత్త సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచే అమల్లోకి రానున్నాయి.

క్రూడ్‌ సోయాబీన్‌, క్రూడ్‌ పామాయిల్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. క్రూడ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై సుంకాన్ని 10 శాతం నుంచి పూర్తిగా తొలగించారు.

రిఫైన్డ్‌ సోయాబీన్‌, పామ్‌ ఆయిల్‌పై దిగుమతి సుంకం 32.5 శాతం నుంచి 27.5 శాతానికి తగ్గింది. రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై సుంకాన్ని 32.5 శాతం నుంచి 22.5 శాతానికి కుదించారు.

సుంకాలు తగ్గడంతో విదేశాల నుంచి నూనె దిగుమతి ఖర్చు తగ్గనుంది. ఈ ప్రయోజనాన్ని కంపెనీలు, వ్యాపారులు వినియోగదారులకు బదిలీ చేస్తే రిటైల్‌ ధరలు తగ్గే అవకాశం ఉంది.

దేశీయ అవసరాలకు భారత్‌ భారీగా వంట నూనెలను దిగుమతి చేసుకుంటోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు, దిగుమతి సుంకాలు దేశంలో వంట నూనె ధరలపై నేరుగా ప్రభావం చూపుతాయి. పండగల సీజన్‌ ముందు వంట నూనెకు డిమాండ్‌ పెరిగే నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
Advertisement
Central Government
Edible oil prices
Import duty reduction
Palm oil
Festive season
Sunflower oil

More Telugu News