ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: ‘బిగ్‌బాస్’లో మేరీ కోమ్ సంచలన వ్యాఖ్యలు
- ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వెల్లడించిన మేరీ కోమ్
- తన పిల్లల కోసమే ఆ ఆలోచన విరమించుకున్నట్లు వెల్లడి
- బిగ్ బాస్ 20 హౌస్‌లో తోటి కంటెస్టెంట్లతో తన గతాన్ని పంచుకున్న బాక్సర్
- దేశం కోసం, కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశానని భావోద్వేగం
- పతకాలపై ఆకలి తీరలేదని, కానీ వయసు అడ్డంకిగా మారిందన్న బాక్సర్
ప్రముఖ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీ కోమ్ తన జీవితంలోని అత్యంత చీకటి రోజులను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురైంది. ఒకానొక దశలో తాను మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, అయితే చిన్నవారైన తన పిల్లల ముఖాలు చూసి ఆ ఆలోచనను విరమించుకున్నానని వెల్లడించింది. ప్రస్తుతం 'బిగ్ బాస్ 20' రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న ఆమె, తోటివారితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ హౌస్‌లో తోటి కంటెస్టెంట్లు ఇషా రిఖీ, రితి తివారీ, కనికా మాన్‌లతో తన జీవితంలోని కష్టాల గురించి మేరీ కోమ్ పంచుకుంది. బాక్సింగ్ రింగ్‌లో ఎంతో దృఢంగా కనిపించే తాను కూడా ఒకానొక సమయంలో పూర్తిగా కుంగిపోయానని అంగీకరించింది. "నేను చాలా బలమైనదాన్ని. కానీ ఆ సంవత్సరంలో పూర్తిగా కుంగిపోయాను. నా జీవితాన్ని ముగించేయాలని కూడా అనుకున్నాను. కానీ నా పిల్లలు అప్పుడు చాలా చిన్నవాళ్ళు. కేవలం వాళ్ల కోసమే నేను ఇంకా బతికి ఉన్నాను" అని చెబుతూ భావోద్వేగానికి గురైంది.
చిన్నతనం నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, తన కుటుంబం, రాష్ట్రం, దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశానని మేరీ కోమ్ గుర్తుచేసుకుంది. "నేను భిన్నమైన అథ్లెట్‌ను. ఇంకా పతకాలు గెలవాలని ఉంది. ఒకటి, రెండు, మూడు పతకాలు నాకు సరిపోవు. పతకాలపై నా ఆకలి ఇంకా తీరలేదు. కానీ, వయసు పెరగడంతో ఇప్పుడు పోటీల్లో పాల్గొనే అవకాశం లేదు" అని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో ఎన్నోసార్లు ఏడ్చానని, ఇప్పుడు ఆ కన్నీళ్లను లోపలే దాచుకోవాల్సి వస్తోందని చెప్పింది.
మణిపూర్‌కు చెందిన మేరీ కోమ్, భారతదేశపు అత్యంత విజయవంతమైన బాక్సర్లలో ఒకరిగా చరిత్ర సృష్టించింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌తో పాటు ఒలింపిక్ పతకాన్ని కూడా సాధించింది. మేరీ కోమ్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు.