భారీ వర్షాల ఎఫెక్ట్.. ఏపీలో పలు విమానాల దారి మళ్లింపు

భారీ వర్షాల ఎఫెక్ట్.. ఏపీలో పలు విమానాల దారి మళ్లింపు

Andhra Pradesh Heavy Rains Several Flights Diverted in AP
  • ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలు
  • విమానాల రాకపోకలకు అనుకూలంగా లేని వాతావరణం
  • విశాఖ నుంచి విజయవాడ వెళ్లాల్సిన విమానం హైదరాబాద్‌కు దారి మళ్లింపు

తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో ఉత్తరాంధ్రను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. మరోవైపు భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా ఏపీలోని ప్రధాన విమానాశ్రయాలలో విమాన రాకపోకలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రన్‌వేలపై భారీగా నీరు చేరడం, దట్టమైన మేఘాలు ఆవరించడంతో విమానాశ్రయ అధికారులు పలు సర్వీసులను దారి మళ్లించడంతో పాటు మరికొన్నింటిని రద్దు చేశారు.


విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి దారి మళ్లించగా, హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. వాతావరణ పరిణామాలు అనుకూలించని దృష్ట్యా ప్రయాణికులు తమ విమాన సమయాలు, రాకపోకల తాజా సమాచారాన్ని ఆయా ఎయిర్‌లైన్స్ సంస్థల ద్వారా ముందస్తుగా సరిచూసుకోవాలని విమానాశ్రయ అధికారులు విజ్ఞప్తి చేశారు.

Advertisement
Andhra Pradesh Rains
Flight Diversions
Visakhapatnam Airport
Indigo Airlines
Vijayawada Airport
AP Weather Update

More Telugu News