క్రికెటర్ల గాయాలపై అశ్విన్‌ సంచలన వ్యాఖ్యలు.. బీసీసీఐకి కీలక సూచనలు

క్రికెటర్ల గాయాలపై అశ్విన్‌ సంచలన వ్యాఖ్యలు.. బీసీసీఐకి కీలక సూచనలు

Ravichandran Ashwin sensational comments on cricketers injuries and key suggestions to BCCI
  • ఆటగాళ్ల గాయాల విషయంలో సీఓఈపై విమర్శలు
  • జవాబుదారీతనం అవసరమన్న అశ్విన్‌
  • మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లకు సూచన
  • ఉదాహరణగా వరుణ్‌ చక్రవర్తిని ప్రస్తావించిన అశ్విన్‌
  • శిక్షణ విధానం కూడా గాయాలకు కారణమవుతుందన్న అశ్విన్‌
భారత క్రికెటర్ల గాయాలు, రిహాబిలిటేషన్‌ విషయంలో బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్ల గాయాల నిర్వహణలో జవాబుదారీతనం అవసరమని స్పష్టం చేశాడు. గాయాల విషయంలో సీఓఈ వ్యవస్థను మరింత సమర్థంగా పనిచేసేలా చూడాలని అభిప్రాయపడ్డాడు. 

తన యూట్యూబ్‌ ఛానల్‌లో అశ్విన్‌ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను సిద్ధం చేయాల్సిన సమయం వచ్చిందన్నాడు. అవసరాన్ని బట్టి ఒకరిద్దరు ఆటగాళ్లు మాత్రమే మూడు జట్లలో ఉండొచ్చని చెప్పాడు. అదే సమయంలో ఆటగాళ్ల గాయాల నిర్వహణకు ఎవరు బాధ్యత వహిస్తారనే అంశంపై స్పష్టత ఉండాలని పేర్కొన్నాడు. 

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ కోసం అనుమతి కోరినా వరుణ్‌ చక్రవర్తిని సీఓఈ విడుదల చేయలేదని అశ్విన్‌ ఉదాహరణగా చెప్పాడు. నెల రోజుల్లో తిరిగి రావాల్సిన ఆటగాడు రెండు, మూడు నెలలు అక్కడే ఉన్నాడని తెలిపాడు. 

ఇటీవల బుమ్రా శ్రీలంక టెస్టు సిరీస్‌కు దూరం కావడం కూడా సీఓఈ, జాతీయ సెలెక్షన్‌ కమిటీ మధ్య సమాచార లోపంపై ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు ఆటగాళ్ల గాయాలు పెరుగుతున్న నేపథ్యంలో బీసీసీఐ కొత్త స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌ హెడ్‌ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. 

ఆటగాళ్ల విషయంలో శిక్షణ విధానం కూడా కీలకమేనని అశ్విన్‌ చెప్పాడు. తనకు 2015లో ఒలింపిక్‌ లిఫ్టింగ్‌ కారణంగానే సైడ్‌ స్ట్రెయిన్‌ వచ్చిందని గుర్తుచేసుకున్నాడు.
Advertisement
Ravichandran Ashwin
BCCI Center of Excellence
Indian Cricketers Injuries
BCCI Rehab Management
Indian Cricket Team News
Ashwin on Player Fitness

More Telugu News