Petrol: నేడు కూడా వడ్డనే... హైదరాబాద్ లో రూ. 86.18కి పెరిగిన పెట్రోలు ధర!

షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శుక్రవారం నాడు కూడా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి. లీటరు పెట్రోలుపై 30 పైసలు, లీటరు డీజిల్ పై 24 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రకటించాయి. దీంతో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోలు ధర రూ. 88.67కు, డీజిల్ ధర రూ. 77.82కు చేరుకున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి తలెత్తింది.

ఇక ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81.28గా ఉండగా, డీజిల్‌ ధర రూ.73.30కి చేరుకుంది. చెన్నైలో పెట్రోలు ధర రూ. 84.49కి, డీజిల్‌ ధర రూ. 77.49కు పెరిగింది. ఇదే సమయంలో హైదరాబాద్‌ లో పెట్రోలు ధర రూ. 86.18కి చేరగా, కోల్ కతాలో పెట్రోలు ధర లీటరుకు రూ. 83.14కు పెరిగింది.
Go Back to Shorts
Petrol
Diesel
Hyderabad
New Delhi
OMCs

More Telugu News