నాగార్జున సాగర్ గేట్లు తెరుస్తున్నాం... అలర్ట్ జారీ!
- 586 అడుగులకు చేరిన నీటి మట్టం
- ఎగువ నుంచి వస్తున్న భారీ వరద
- ముంపు ప్రాంత వాసులకు హెచ్చరికలు జారీ
సాగర్ డ్యామ్ ఇప్పటికే నిండుకుండలా మారగా, చూసేందుకు వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం సాగర్ కు 75 వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండగా, నారాయణపూర్ నుంచి సుమారు 1.30 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వచ్చి చేరుతోంది. ఆ నీరు ఈ సాయంత్రం శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటుందని అంచనా. ఆ వెంటనే మరోసారి శ్రీశైలం గేట్లను అధికారులు తెరవనున్నారు. శ్రీశైలం వరద సాగర్ ను చేరేలోపే సాగర్ గేట్లను తెరుస్తామని అధికారులు చెబుతున్నారు.