Jagan: జగన్‌ అవినీతి పోరాటం చేస్తున్నారు: ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తోన్న నవ నిర్మాణ దీక్ష సందర్భంగా అర్హులకు తాము 2.42 లక్షల రేషన్‌ కార్డులను అందజేస్తున్నామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు గుంటూరు జిల్లాలోని యడ్లపాడులో నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో తాము చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు.

ఒక అవినీతిపరుడు టీడీపీపై అవినీతి ముద్ర వేయాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్‌ను ఉద్దేశించి ప్రత్తిపాటి విమర్శించారు. వైసీపీ ఎంపీల రాజీనామా అంతా డ్రామా అని, ఉప ఎన్నికలకు భయపడడం వల్లే వారు సకాలంలో రాజీనామాలు చేయలేదని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాటం చేస్తున్నారని, మరోవైపు జగన్‌ అవినీతి పోరాటం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.            
Go Back to Shorts
Jagan
prattipati
Telugudesam

More Telugu News