కన్నడనాటి పెను'గాలి'... ఏకంగా 9 టికెట్లు ఇచ్చిన బీజేపీ!
- కర్ణాటక ఎన్నికల్లో పెద్దపీట వేసిన బీజేపీ
- సంబంధం లేదంటూనే మూడు జిల్లాల్లో టికెట్లు
- ఎంతమంది గెలుస్తారన్నది వేచి చూడాల్సిందే
గాలి దగ్గరి సన్నిహితుడు ప్రస్తుత బళ్లారి ఎంపీ బీ శ్రీరాములుకు మొలకాల్మూరు టికెట్ ఇచ్చారు. వీరితో పాటు హగరిబొమ్మనహళ్లిలో నేమ రాజనాయక్, హూవినహడగలిలో చంద్రనాయక్, కంప్లిలో సురేష్ బాబులకు టికెట్లు ఖరారు చేయగా, వీరంతా గాలి అనుచరులే. ఇక 2008 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఈ మూడు జిల్లాల్లో ఓ వెలుగు వెలిగి, అంతే వేగంగా పాతాళానికి కూరుకుపోయిన గాలి జనార్దన్ రెడ్డి, తన వర్గం ఎమ్మెల్యేల్లో ఎందరిని గెలిపించుకుని అసెంబ్లీకి పంపుతారన్న విషయం మరో నెల రోజుల్లో తేలిపోతుంది.