ఆరోజున గుంట నక్కల గుట్టు విప్పుతా : ఏపీఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి

  • మంత్రి అఖిల ప్రియతో విభేదాలు వాస్తవమే
  • ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోను
  • 29న ‘ఏవీ హెల్ప్ లైన్’ ప్రారంభిస్తున్నా 
గుంట నక్కలు తనను దెబ్బతీయాలని చూస్తున్నాయంటూ భూమా నాగిరెడ్డి ప్రథమ వర్ధంతి సభలో మంత్రి అఖిల ప్రియ ఇటీవల వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భూమా నాగిరెడ్డి సన్నిహిత మిత్రుడు, ఏపీఆర్ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను పట్టించుకోనని, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో టీడీపీ పటిష్టతకు తాను కృషి చేస్తానని అన్నారు. ఆ రెండు నియోజక వర్గాల్లో పార్టీ పటిష్టతకు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆళ్లగడ్డలో ఈ నెల 29న ఏవీ హెల్ప్ లైన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఆరోజున గుంట నక్కల గుట్టు విప్పుతానని చెప్పిన సుబ్బారెడ్డి, మంత్రి అఖిలప్రియతో విభేదాలు వాస్తవమేనని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Telugudesam
akhila priya
av subba reddy

More Telugu News