Andhra Pradesh: కుప్పం నియోజకవర్గ ప్రజలు.. మా కుటుంబానికి ప్రాణ సమానులు : నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
'కుప్పం నియోజకవర్గ ప్రజలు..మా కుటుంబానికి ప్రాణ సమానులు' అని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని ననియాల ఫారెస్ట్ ఎకో టూరిజం ప్రాజెక్ట్ వద్ద ఈరోజు మధ్యాహ్నం నిర్వహించిన ‘జన్మభూమి- మా ఊరు’ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు 67 సంవత్సరాల వయసులో కూడా అలుపు లేకుండా, తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజల కోసం, రాష్ట్రం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపడతామని అన్నారు. ప్రతి గ్రామాన్ని టెన్ స్టార్ గ్రామాలుగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్బంగా ఆయన హామీ ఇచ్చారు.  
Go Back to Shorts
Andhra Pradesh
Nara Lokesh

More Telugu News