అడ్డంగా దొరికిపోయి.. నెపాన్ని అధికారులపై నెడుతున్నారు: చంద్రబాబుపై రోజా విమర్శలు
Add ap7am to your home Screen

అడ్డంగా దొరికిపోయి.. నెపాన్ని అధికారులపై నెడుతున్నారు: చంద్రబాబుపై రోజా విమర్శలు

  • లోకేశ్ కోసమే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు
  • ఎప్పుడూ అధికారంలో ఉండాలనే స్వార్థం
  • చంద్రబాబును పీఠాధిపతులు నిలదీయాలి
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన తప్పుకు మహిళా అధికారిని బలి చేశారని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రోజా మాట్లాడుతూ, కొడుకు లోకేశ్ కోసమే చంద్రబాబు క్షుద్ర పూజలు చేయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే, అడ్డంగా దొరికిపోయేసరికి ఆ నెపాన్ని అధికారులపై నెడుతున్నారని అన్నారు. ఆయన, ఆయన కుమారుడు లోకేశ్ ఎప్పుడూ అధికారంలో ఉండాలన్న స్వార్థంతోనే తాంత్రిక పూజలు చేయించారని ఆరోపించారు. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పూజలు చేయించడం అరిష్టమని చెప్పారు. ఇలాంటి విషయాలపై చంద్రబాబును పీఠాధిపతులు నిలదీయాలని అన్నారు. 
Chandrababu
Nara Lokesh
roja

More Telugu News