Nara Lokesh: నారా లోకేశ్ ను సీఎం చేసేందుకు తాంత్రిక పూజలు నిర్వహించారు: అంబటి రాంబాబు ఆరోపణ

షార్ట్స్‌లో చూడండి
ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ను సీఎం చేసేందుకు విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు నిర్వహించారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని, పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇక ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరగలేదని చెప్పిన ఆయన, చంద్రబాబు కుటుంబం మాత్రం వేదపండితుల ఆశీర్వాదాలు అందుకున్నారని విమర్శించారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలకు నిబంధనల సడలింపు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
Nara Lokesh
ambati

More Telugu News