nagarjuna: వర్మ సంచలన ప్రకటన .. నాగ్ హీరోగా మరో యాక్షన్ మూవీ!

షార్ట్స్‌లో చూడండి
రామ్ గోపాల్ వర్మ వరుస సినిమాలను ఎనౌన్స్ చేస్తూ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటాడు. అలాంటి సినిమాల్లో కొన్ని ఆదిలోనే ఆగిపోతే .. మరికొన్ని మాత్రం పట్టాలెక్కేస్తూ ఉంటాయి. ఈ కోవలో నాగార్జున హీరోగా తాను మరో సినిమాను తెరకెక్కించనున్నట్టు తాజాగా ఆయన సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'శివ' అప్పట్లో కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఆ సినిమా తర్వాత ఇద్దరి కలయికలోను 'అంతం', 'గోవిందా గోవిందా' చిత్రాలు వచ్చాయి. మళ్లీ ఇన్నాళ్లకు నాగార్జునతో చేయడానికి వర్మ సిద్ధమవుతుండటం విశేషం. అయితే ఇది 'శివ' సినిమాకి సీక్వెల్ కాదు .. అంతకి మించిన డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని వర్మ అన్నాడు. వాస్తవానికి దగ్గరగా వుండే యాక్షన్ మూవీగా ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని అన్నాడు.   
Go Back to Shorts
nagarjuna

More Telugu News