nagarjuna: గ్రాఫిక్స్ వర్క్ చూస్తా .. నచ్చితేనే డబ్బింగ్ చెబుతానని కండిషన్ పెట్టా: నాగార్జున

షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో నాగార్జున తన సినిమాలకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీలైతే ఎడిటింగ్ లో కూర్చుంటున్నారు .. అవసరమైతే రీ షూట్ చేయిస్తున్నారు. అలాగే ఆయన 'రాజుగారి గది 2' సినిమాకి కూడా రీ షూట్లు పెట్టించి, అనుకున్న అవుట్ పుట్ ను రాబట్టారు.

 అలాంటి నాగార్జున తాజాగా మాట్లాడుతూ .. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ గురించి ప్రస్తావించారు. వీఎఫ్ఎక్స్ దగ్గర చాలా ఆలస్యం జరిగిపోతూ ఉంటుందని ఆయన అన్నారు. ఈ రోజు .. రేపు అంటూ కాలం గడిచిపోతూ ఉంటుందని చెప్పారు. హడావిడి పెట్టేస్తే ఏదో ఒకటి చేసేసి ఇచ్చేస్తారని అన్నారు. దాంతో అనుకున్న క్వాలిటీ రాక విమర్శలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు. అందువలన వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తయిన తరువాత చూసి .. నచ్చితేనే డబ్బింగ్ చెబుతానని కండిషన్ పెట్టినట్టు స్పష్టం చేశారు.   
Go Back to Shorts
nagarjuna
sheerath kapoor

More Telugu News