nagarjuna: 'అర్జున్ రెడ్డి' చూశాక అభిప్రాయం చెబుతా!: నాగార్జున

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై అగ్రకథానాయకుడిగా నాగార్జున ఎన్నో విజయవంతమైన సినిమాలు చేశారు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. టాలీవుడ్ మన్మథుడు అనిపించుకున్నారు. అలాంటి నాగార్జున పుట్టినరోజు .. ఈ రోజు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో 'అర్జున్ రెడ్డి' సినిమా ప్రస్తావన వచ్చింది.

ఈ సినిమాలో ఓవర్ గా ముద్దు సీన్లు .. బూతులు ఎక్కువగా ఉండటం ఎంతవరకూ కరెక్ట్? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది. బాలీవుడ్ మూవీస్ లో ముద్దు సీన్లు ఎక్కువగానే ఉంటాయనీ, అలాంటప్పుడు టాలీవుడ్ లో ముద్దు సీన్లకు అభ్యంతరం అవసరం లేదనుకుంటానని అన్నారు. ఈ సినిమాకి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక బూతుల విషయానికొస్తే .. ఈ సినిమా తాను ఇంతవరకూ చూడలేదనీ, చూసిన తరువాత తన అభిప్రాయాన్ని చెబుతానని అన్నారు.     
Go Back to Shorts
nagarjuna

More Telugu News