- ఫోరమ్ షాపింగ్ లేదా లిటిగేషన్ టూరిజం పోకడలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం
- కర్ణాటక, తమిళనాడుకు చెందిన సంస్థల వివాదాన్ని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేయడంపై ఆక్షేపణ
- సంబంధిత ఐపీ దావాను ఢిల్లీ నుంచి మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేసిన సుప్రీం ధర్మాసనం
- హైకోర్టుల మధ్య ఎలాంటి అంతరాలు, క్రమానుగత వ్యత్యాసాలు ఉండవని స్పష్టీకరణ
- మేధో సంపత్తి హక్కుల కేసులకు ఒక నిర్దిష్ట హైకోర్టే మేలనే భావన తప్పన్న న్యాయస్థానం
తమకు అనుకూలమైన న్యాయస్థానాలను ఎంచుకుంటూ పిటిషన్లు దాఖలు చేసే ‘ఫోరమ్ షాపింగ్’ (లేదా లిటిగేషన్ టూరిజం) ధోరణిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాంకేతిక పరిధి ఉందన్న ఏకైక కారణంతో సుదూర ప్రాంతాల్లోని హైకోర్టులను ఆశ్రయించడం సరైంది కాదని స్పష్టం చేసింది. మేధో సంపత్తి హక్కుల (ఐపీ) వివాదానికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో నడుస్తున్న ఒక వాణిజ్య దావాను మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహదేవన్లతో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించి బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగళకు చెందిన ‘మెసర్స్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఆగ్రో ఫుడ్స్’, ఇతర సంస్థలు వాది (ప్లైంటిఫ్) పక్షంగా ఢిల్లీ హైకోర్టులో వాణిజ్య దావా [CS(COMM) 625/2026] వేశాయి. చెన్నైకి చెందిన ‘సాయి మహాలక్ష్మి ట్రేడర్స్’ సహా మరికొందరు ప్రతివాదులుగా ఉన్నారు. అయితే, ఇరు పక్షాలు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడుకు చెందినవే అయినప్పుడు కేసును ఢిల్లీలో ఎందుకు దాఖలు చేశారో తమకు అర్థం కావడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసును చెన్నైకి బదిలీ చేయాలంటూ ప్రతివాదులు దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. వివిధ కోర్టులకు ప్రాదేశిక అధికార పరిధి ఉన్నంత మాత్రాన, పిటిషనర్లు తమకు నచ్చిన న్యాయస్థానాన్ని ఎంచుకునే ‘ఫోరమ్ షాపింగ్’ విధానాన్ని సమర్థించుకోలేరని తేల్చిచెప్పింది. ఇలాంటి చర్యలు దేశంలోని హైకోర్టుల మధ్య అంతరాలు ఉన్నాయనే తప్పుడు భావనను పెంచుతాయని వ్యాఖ్యానించింది. ముఖ్యంగా మేధో సంపత్తి, వాణిజ్య వివాదాలను విచారించడానికి ఒక నిర్దిష్ట హైకోర్టు (ఢిల్లీ హైకోర్టు వంటివి) మాత్రమే అత్యుత్తమమైనదనే ఆలోచన పూర్తిగా తప్పు అని, అది తప్పుడు అవగాహనతో కూడుకున్నదని స్పష్టం చేసింది.
వివాదం ఎక్కడైతే మొదలైందో, ఇరు పక్షాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలోని న్యాయస్థానాలే కేసులోని వాస్తవాలను సమగ్రంగా అర్థం చేసుకోగలవని కోర్టు అభిప్రాయపడింది. మద్రాస్ హైకోర్టుకు స్వయంగా సివిల్ విచారణ చేపట్టే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న విషయాన్ని గుర్తుచేసింది. ఈ క్రమంలోనే సదరు కేసును తక్షణమే మద్రాస్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఇరు పక్షాల ప్రతినిధులు కోర్టుకు నేరుగా గానీ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ హాజరు కావచ్చని తెలిపింది.
వాణిజ్య వివాదాల్లో ఢిల్లీ హైకోర్టును మాత్రమే ప్రాధాన్య వేదికగా భావించి ఇతర రాష్ట్రాల వారు సైతం అక్కడికే వెళ్లే పోకడలపై గతంలో ఢిల్లీ హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.