Advertisement

సీఐఐ సదస్సు ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. 'బ్రాండ్ సీబీఎన్' చలవే ఏపీకి పెట్టుబడుల వెల్లువ: ఎంపీ చింతకాయల విజయ్

Andhra
Advertisement
  • 'బ్రాండ్ చంద్రబాబు', మంత్రి లోకేశ్ చొరవ వల్లే పెట్టుబడులు వస్తున్నాయ‌న్న ఎంపీ
  • గత ప్రభుత్వంలో యూట్యూబ్ ఛానళ్లతో నకిలీ ఒప్పందాలు చేసుకున్నాయ‌ని విమ‌ర్శ‌
  • ఇప్పటికే రూ.11 లక్షల కోట్ల ప్రాజెక్టులు గ్రౌండింగ్, 15 లక్షల ఉద్యోగాల సృష్టించామ‌న్న విజ‌య్‌
  • గూగుల్, రిలయన్స్ సహా రాష్ట్రానికి తరలివస్తున్న అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, విశాఖపట్నం వేదికగా జరగనున్న సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) సదస్సు ద్వారా రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని పెనమలూరు ఎంపీ చింతకాయల విజయ్ వెల్లడించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వ ప్రతిభ, ఆయన బ్రాండ్ ఇమేజ్‌పై ఉన్న విశ్వసనీయత వల్లే నేడు దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలు మళ్లీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. "ఈ రోజు దేశం మొత్తం వైజాగ్ సీఐఐ సమ్మిట్ వైపు ఆసక్తిగా చూస్తోందంటే దానికి కారణం 'బ్రాండ్ సీబీఎన్'. ఆయన విజన్, పాలసీలపై ఉన్న నమ్మకమే పెట్టుబడిదారులను మన రాష్ట్రం వైపు నడిపిస్తోంది" అని విజయ్ అన్నారు.

గత ప్రభుత్వ అబద్ధాలకు చరమగీతం
గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రతిష్టను పూర్తిగా దిగజార్చారని చింతకాయల విజయ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. వైసీపీ హయాంలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామంటూ పచ్చి అబద్ధాలు చెప్పారని, సదస్సుల పేరుతో రూ.72 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. యూట్యూబ్ ఛానళ్లు, అప్పడాలు, బొబ్బట్ల తయారీ కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దౌర్భాగ్య పాలన నడిచిందని ఎద్దేవా చేశారు. 

ఆ ఐదేళ్లలో నేరాలు పెరిగి, నిరుద్యోగం 24 శాతానికి ఎగబాకిందని, ఉపాధి లేక వేలాది మంది యువత ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితిని కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరరాజా, జాకీ, లూలూ గ్రూప్ వంటి సంస్థలను కక్షపూరితంగా వేధించి రాష్ట్రం నుంచి తరిమేశారని మండిపడ్డారు.

'జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్' లోకేశ్.. చేతలతోనే పాలన
మంత్రి నారా లోకేశ్ ను యువత ‘జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్’గా ఎందుకు పిలుస్తుందో ఆయన పనితీరే నిరూపిస్తోందని విజయ్ అన్నారు. యువగళం పాదయాత్రలో జీడీ నెల్లూరులో ఓ తల్లి తన బిడ్డ ఉద్యోగం కోసం పడిన ఆవేదన చూసి, రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో లోకేశ్ పనిచేస్తున్నారని తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఒక వాట్సాప్ సందేశం పంపితే నిమిషాల్లో స్పందిస్తూ, సింగిల్ డెస్క్ విధానం ద్వారా అనుమతులు వేగవంతం చేస్తూ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏంటో చూపిస్తున్నారని కొనియాడారు. ఒక్క జూమ్ కాల్‌తో 'ఆర్సెలర్ మిట్టల్' లాంటి దిగ్గజ సంస్థను ఒప్పించిన ఘనత లోకేష్‌ది అని ప్రశంసించారు.

గణాంకాలతో దూసుకెళ్తున్న ఏపీ
కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని చెప్పడానికి గణాంకాలే నిదర్శనమని ఎంపీ విజయ్ స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో రూ.11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యాయని, వీటి ద్వారా 15 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. 2025–26లో దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఏపీ ఏకంగా 25.3% వాటాను దక్కించుకుని ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ కంటే ముందు నిలిచిందని గుర్తుచేశారు. 

గూగుల్ ఏఐ హబ్, బ్రూక్‌ఫీల్డ్, రిలయన్స్ డేటా సెంటర్, హిందూజా గ్రూప్, టీసీఎస్, కియా ఫేజ్-2 విస్తరణ, పుట్టపర్తిలో డీఆర్‌డీఓ ఫైటర్ జెట్ సెంటర్, ఓర్వకల్లులో డ్రోన్ సిటీ వంటి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాష్ట్రానికి వస్తున్నాయని వివరించారు.

సమగ్ర ప్రగతి.. చంద్రబాబు విజన్
ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని విజయ్ అన్నారు. విశాఖ, కాకినాడ, అనంతపురం, తిరుపతిలలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి రూ.85,650 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిర్చినట్లు తెలిపారు. 'రైజింగ్ రాయలసీమ' పేరుతో ఆ ప్రాంత పారిశ్రామిక ప్రగతికి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకెళ్తున్నామన్నారు. 

ఒకవైపు పారిశ్రామిక ప్రగతి సాధిస్తూనే, మరోవైపు పోలవరం, అమరావతి నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, లోకేష్ కార్యదక్షతతో ఆంధ్రప్రదేశ్ మళ్లీ ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని, విశాఖ సదస్సుతో రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

మీ కోసం మరిన్ని

Chinthakayala VijayCII Summit VisakhapatnamChandrababu NaiduAndhra Pradesh InvestmentsNara Lokesh Job CreatorBrand CBN

More Telugu News

సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

11 Nov, 14:19

చెప్పుడు మాటలు విని జగన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు: విజయసాయిరెడ్డి

11 Nov, 14:17

విశాఖలో రేపటి నుంచే సీఐఐ భాగస్వామ్య సదస్సు.. సర్వం సిద్ధమన్న సీఎం చంద్రబాబు

11 Nov, 14:03

‘శ్రేయస్‌.. నీ వెనక నేనున్నా’.. పంజాబ్‌కు మారిన తర్వాత హార్దిక్‌ ఫస్ట్‌ రియాక్షన్

11 Nov, 13:59

అంతర్జాతీయ స‌మ్మిట్‌కు ముస్తాబైన విశాఖ.. రేపటి నుంచి సీఐఐ భాగస్వామ్య సదస్సు.. పెట్టుబడులే లక్ష్యంగా భారీ ఏర్పాట్లు

11 Nov, 13:46

దీపావళికి టపాసులు కాలిస్తే తప్పేంటి? కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్‌ కీలక వ్యాఖ్యలు

11 Nov, 13:32

‘‘అచ్చం మా డిఫెండర్‌లాగే’’.. చైనా ఆటోమొబైల్ కంపెనీ బీవైడీపై కోర్టుకెళ్లిన జాగ్వార్

11 Nov, 13:28

'అనకాపల్లి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

11 Nov, 13:18

రాప్తాడు కేసు: నిందితుడి కాలును భద్రపరచండి.. హైకోర్టు కీలక ఆదేశాలు

11 Nov, 13:09

మహేశ్ గౌడ్‌తో ఎలాంటి గ్యాప్ లేదు.. త్వరలోనే కొత్త జాబితా: చామల కిరణ్ కుమార్ రెడ్డి

11 Nov, 13:07

పల్నాడు గురుకులంలో దారుణం.. నిద్రిస్తున్న విద్యార్థినుల జుట్టు కత్తిరింపు!

11 Nov, 13:02

80 లక్షల మంది పట్టభద్రులలో 10 లక్షల మంది కూడా ఓటు నమోదు చేసుకోలేదు: కవిత ఆందోళన

11 Nov, 13:00

లోకల్ రైళ్లలో ప్రమాదాలకు చెక్.. ముంబైలో పట్టాలెక్కిన ఆటోమేటిక్ డోర్ల నాన్-ఏసీ రైలు

11 Nov, 12:58

మ్యూజియానికి సచిన్‌ 26 బ్యాట్లు.. నవంబర్‌ 16న ‘బ్యాటోగ్రఫీ’

11 Nov, 12:47
..More Telugu News