- దీపావళి ఫొటోలను షేర్ చేసిన శోభిత
- నాగచైతన్య, నాగార్జునతో కలిసి వేడుకలు
- అక్కినేని కుటుంబంతో ప్రత్యేక ఫొటోలు
- నల్లటి సంప్రదాయ దుస్తుల్లో శోభిత సందడి
- తన ఫొటో ఉన్న తారాజువ్వల పెట్టె ప్రత్యేక ఆకర్షణ
నటి శోభిత ధూళిపాళ్ల తన దీపావళి వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. భర్త నాగచైతన్యతో పాటు మామ నాగార్జున, అక్కినేని కుటుంబ సభ్యులతో కలిసి పండగను జరుపుకొన్న ఫొటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
శోభిత షేర్ చేసిన ఫొటోల్లో నాగచైతన్యతో కలిసి అక్కినేని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో ఆమె కనిపించింది. ఈ ఫొటోలో నటుడు నాగార్జున కూడా ఉన్నాడు. ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలకు సంబంధించిన మరికొన్ని చిత్రాలను కూడా ఆమె అభిమానులతో పంచుకుంది.
పండగ కోసం శోభిత నల్లటి సంప్రదాయ దుస్తులను ధరించింది. వాటిపై బంగారు రంగు ఎంబ్రాయిడరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంట్లో పూలతో చేసిన అలంకరణలు, కొవ్వొత్తులు, ప్రమిదలు, రంగవల్లుల ఫొటోలను షేర్ చేసింది. రంగవల్లుల చుట్టూ దీపాలు వెలిగిస్తున్న చిత్రాన్ని కూడా పోస్ట్ చేసింది. పండగ విందులో భాగంగా నూడుల్స్ ఫొటోను సైతం పంచుకుంది.
ఇక తన ఫొటో ముద్రించిన తారాజువ్వల పెట్టెను చూపిస్తూ శోభిత చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. దీనిపై ‘Another Diwali Another slay’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. చివరగా ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు’ అంటూ అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలిపింది.
నాగచైతన్య, శోభిత 2024 డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో సంప్రదాయ తెలుగు పద్ధతిలో వీరి పెళ్లి జరిగింది. అంతకుముందు నాగచైతన్య నటి సమంతను 2017లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2021లో ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు.