- వేదికపై పాడటానికి గంట ముందే పాట నేర్చుకున్నానన్న చిన్మయి
- శ్రేయా ఘోషల్ పాటతో పోలికల నేపథ్యంలో స్పందన
- 25 ఏళ్లుగా పాడుతున్నా తనపై తనకు నమ్మకం కుదరదన్న గాయని
- సవాళ్లను స్వీకరించడం ఇష్టమని పేర్కొన్నగాయని
ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది. నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామాయణ: పార్ట్ 1’ చిత్రంలోని ‘జూడీ జోడీ’ అనే గీతాన్ని చెన్నైలో నిర్వహించిన ఆడియో విడుదల వేడుకలో ఆమె ప్రత్యక్షంగా ఆలపించింది. అయితే, ఆ ప్రదర్శనకు కేవలం గంట ముందు మాత్రమే తాను ఆ పాటను నేర్చుకున్నట్లు ఆమె పేర్కొంది.
ఈ పాట హిందీ వెర్షన్‌ను ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ ఆలపించగా, చిన్మయి లైవ్ ప్రదర్శనను కొందరు నెటిజన్లు ఆమెతో పోల్చారు. ఈ నేపథ్యంలోనే చిన్మయి ‘ఎక్స్’ వేదికగా స్పందించింది. “వేదికపైకి వెళ్లడానికి గంట ముందు మాత్రమే ఈ పాటను నేర్చుకున్నాను. ఇలాంటి అవకాశం రావడం సంతోషకరం. గంటల తరబడి సాధన చేసి ‘కంఫర్ట్ జోన్’లో ఉండటం కంటే, ఇలాంటి సవాళ్లను స్వీకరించడమే నాకు ఇష్టం” అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది.
తాను ఎల్లప్పుడూ స్వీయ విమర్శ చేసుకుంటానని, తనలో ఒక కఠినమైన అంతర్గత స్వరం వినిపిస్తుంటుందని చిన్మయి తెలిపింది. సుమారు 25 ఏళ్లుగా వృత్తిపరమైన గాయనిగా కొనసాగుతున్నప్పటికీ, కెరీర్ ఆరంభంలో ఉన్నంత ఆత్మవిశ్వాసం ఇప్పటికీ ఉందని, ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’తో బాధపడుతున్నానని ఆమె వెల్లడించింది. ఒక కొత్త పాటతో మమేకం కావడానికి కొంత సమయం పడుతుందని, అయితే తనకు గానం పట్ల ఉన్న మక్కువనే అన్నింటికంటే ముఖ్యమని ఆమె వివరించింది.