- రూ. 15కే అపరిమిత 5G డేటా ప్యాక్‌ను తెచ్చిన రిలయన్స్ జియో
- ఈ ప్యాక్ వ్యాలిడిటీ 24 గంటలు మాత్రమే
- 4K స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి అధిక డేటా అవసరాల కోసం రూపకల్పన
- 5G ఫోన్, జియో ట్రూ 5G కవరేజ్ ఉన్న ప్రాంతంలో ఈ ప్యాక్ పనిచేస్తుంది
టెలికాం రంగంలో సంచలనాలకు మారుపేరైన రిలయన్స్ జియో, తన 5G యూజర్ల కోసం మరో ఆకర్షణీయమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ. 15 ధరతో సరికొత్త డేటా ప్యాక్‌ను పరిచయం చేసింది. ఈ ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకున్న వినియోగదారులు 24 గంటల పాటు అపరిమిత హై-స్పీడ్ 5G డేటాను పొందవచ్చు.
ఒక్క రోజులో అధిక డేటా అవసరమయ్యే వారిని దృష్టిలో ఉంచుకొని జియో ఈ ప్యాక్‌ను రూపొందించింది. ముఖ్యంగా 4K వీడియో స్ట్రీమింగ్, ఆన్‌లైన్ గేమింగ్, క్లౌడ్ బ్యాకప్, హాట్‌స్పాట్ ద్వారా ఇతర డివైజ్‌లకు డేటా షేర్ చేయడం, పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి అవసరాలకు ఈ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వ్యాలిడిటీ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది.
అయితే, ఈ ఆఫర్‌ను వినియోగించుకోవాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. యూజర్ల వద్ద తప్పనిసరిగా 5G స్మార్ట్‌ఫోన్ ఉండాలి. అలాగే, వారు జియో ట్రూ 5G కవరేజ్ ఉన్న ప్రాంతంలో నివసిస్తూ ఉండాలి. వినియోగదారుడి ప్రస్తుత బేస్ ప్లాన్‌ను బట్టి కూడా ఈ ప్యాక్ అర్హత ఆధారపడి ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని టెలికాం సర్కిళ్లలో అందుబాటులో ఉన్న ఈ ప్యాక్‌ను MyJio యాప్, Jio.com వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లు, ఇతర థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు.